Saturday, April 13, 2013

70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
* ఈ ఏడాది భర్తీ
* ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు రూ.10 లక్షలు
* సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
గుంటూరు: రాష్ట్రంలో ఈ ఏడాది 60 నుంచి 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీలో ప్రతిభకు తప్ప పైరవీలు, డబ్బులకు అవకాశాలు ఇవ్వని సంస్కృతి తీసుకొచ్చామన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని ధీమాగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలు 'ఇందిరమ్మ కలలు-నేటికి నిజం' కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 12న ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ఫిరంగిపురం వచ్చారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మేరకు ఉన్న దళిత, గిరిజనుల కోసం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చామని, దీని ద్వారా వారికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు పెడతామన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ఇందిరమ్మ కన్న కలలు సాకారం చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ చదువులకు రూ.10 లక్షలు ఖర్చయిన ప్రభుత్వమే చదివిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

No comments:

Post a Comment