Friday, January 11, 2013

అబ్కారీ కొలువులు సిద్ధం!

అబ్కారీ కొలువులు సిద్ధం! * ప్రభుత్వ దుకాణాల్లో ఉద్యోగుల నియామకానికి సన్నాహాలు * 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్: రాష్ట్రంలో ఆబ్కారీశాఖ అధికారులు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నతాధికారులు జనవరి 11న ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల్లో నియమించే సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపైనే తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 17లోగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే అన్ని జిల్లాల్లోనూ నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. ఒక్కో మద్యం దుకాణానికి ఒక సూపర్‌వైజర్, ఒక సహాయ సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లను నియమించాలని నిర్ణయించారు. ఇవీ నిబంధనలు.. * సేల్స్‌మెన్ ఉద్యోగానికి 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. * సహాయ సూపర్‌వైజర్ ఉద్యోగానికి డిగ్రీ అర్హత. * సీనియర్ సహాయకుడి స్థాయిలో పింఛను అందుకుంటున్న పదవీ విరమణ చేసిన వ్యక్తి సూపర్‌వైజర్ ఉద్యోగానికి అర్హుడు. * 18వ తేదీ నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 28వ తేదీ నాటికి పూర్తి చేసిన దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. * కాంట్రాక్టు ఒప్పందం ముందుగా జూన్ 30 వరకే ఉంటుంది. ఆ తర్వాత పొడిగించే విషయాన్ని ఏపీబీసీఎల్ అధికారులు చూస్తారు.

No comments:

Post a Comment