Meeseva & Telangana State Online Service/Andhra Pradesh Online Services/ All Govt Recruitmenrs Services
Tuesday, January 22, 2013
Police Constable Preparation Plan
Police Constable Preparation Plan
పోలీసు కొలువుకు సిద్ధమేనా?
రాష్ట్ర పోలీసుశాఖలో 6071 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇంటర్ అర్హతతో ప్రభుత్వోద్యోగం పొందే చక్కని అవకాశమిది. కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐలుగా ఎదిగే అవకాశాలుంటాయి. ఆసక్తి, అర్హతలున్నవారు పట్టుదలతో కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు!
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తొలిదశ అయిన శారీరక పరీక్షల్లో నెగ్గాలి. ఆపై రెండోదశ అయిన రాత పరీక్షలో కూడా ప్రతిభ చూపించగలిగితే కానిస్టేబుల్ కొలువులకు ఎంపికవుతారు. ఇవి జిల్లాస్థాయి పోస్టులు. రాష్ట్రంలోని ఒక్కోజిల్లాలో ఈ పోస్టుల సంఖ్య ఒక్కో రకంగా ఉంది. పూర్తి వివరాలకు www.apstatepolice.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎన్ని ఖాళీలు?
(i) పురుషులకు: 3228 (అన్నీ కలిపి)
(ii) స్త్రీలకు: సివిల్: 2749; ఎ.ఆర్.: 94
విద్యార్హత: ఇంటర్ ఉత్తీర్ణత/ దీనికి సమానమైన అర్హత
వయసు: 1 జులై 2012 నాటికి 18 సంవత్సరాలు నిండి 22 సంవత్సరాలు దాటకూడదు.
దరఖాస్తు గడువు: 21-01-13 నుంచి 20-02-13 వరకూ
దరఖాస్తులను అభ్యర్థి స్వయంగా జిల్లా పోలీస్ కార్యాలయాలు/ పోలీస్ కమిషనరేట్స్‌లో దాఖలు చేయవచ్చు.
శారీరక ప్రమాణాలు
పురుష అభ్యర్థులకు-
ఎత్తు: 167.6 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఛాతీ: 86.3 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి.
స్త్రీ అభ్యర్థులకు-
ఎత్తు: 152.5 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. బరువు: 40 కేజీల కంటే తక్కువ ఉండకూడదు.
అభ్యర్థి నిర్ణీత సమయాన్ని ముందుగానే నిర్ణయించుకోకుండా వారం రోజులపాటు 15 నిమిషాలు, తర్వాత వారంరోజులు 20 నిమిషాలు, ఆపై వారం 20 నుంచి 30 నిమిషాలు ఆగకుండా పరుగెత్తడం సాధన చేస్తే శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది.
ఈ విభాగంలో ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ (PQT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)అనే రెండు దశలుంటాయి. వీటిలో కీలకం PQT. ఎందుకంటే దీనిలో అర్హత సాధించిన తర్వాత మాత్రమే రెండో దశకు అనుమతి లభిస్తుంది.
ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్‌లో నిర్దేశించిన దూరాన్ని నిర్ణీతకాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 25 ని||ల్లో, మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ. దూరాన్ని 16 ని||ల్లో చేరుకోవాలి.
చేయవలసినవి
అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సాధనకు కొంత సమయం కేటాయించాలి.
సాధన సమయంలో స్పోర్ట్స్ షూ ధరించడం సౌకర్యం.
పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పండ్ల రసాలు, మాంసం తీసుకోవాలి.
ప్రతిరోజు కనీసం 5 లీటర్ల నీరు తాగాలి.
పరుగు, ఈవెంట్స్ ముందు శరీరాన్ని warmup చేసుకోవాలి.
5 కి.మీ. పరుగు పూర్తయిన తర్వాత ముక్కుతో గాలి ఎక్కువగా తీసుకుంటూ నోటితో వదిలేస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండాలి.
చేయకూడనివి
పరిగెత్తేటపుడు చేతులు, కాళ్ళు బిగించరాదు.
5 కి.మీ. పరుగు తర్వాత పడుకోవడం, కూర్చోవడం లాంటివి చేయకూడదు.
పరుగు మొదలైన తర్వాత ఒకేసారి వేగంగా పరుగెత్తకూడదు.
పరుగెత్తేపుడు నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు లాంటివి పెట్టుకోకూడదు.
మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
రాత పరీక్షలో విభాగాలు
1) ఇంగ్లిష్
2) అరిథ్‌మేటిక్
3) జనరల్ సైన్స్
4) భారతదేశ చరిత్ర
5) భారతదేశ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు
6) జనరల్ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు
7) రీజనింగ్
వీటిలో మొదటి రెండింటి గురించి చూద్దాం
ఇంగ్లిష్: కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్ధుల్లో ఎక్కువశాతం గ్రామీణ విద్యార్ధులే. వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఆంగ్లం క్లిష్టమనే భావన మనసులో పాతుకుని ఉంటుంది. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ విభాగం నుండి 10- 20 ప్రశ్నలు రావచ్చు. అర్థం చేసుకుంటూ సాధన చేయాలి. ఇంటర్‌స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. వ్యాకరణాంశాలు అన్నింటిపైనా అభ్యాసం అవసరం.
అరిథ్‌మేటిక్: ఈ విభాగం నుంచి 25- 40 ప్రశ్నలు రావచ్చు. దీనిలోని ప్రశ్నలు అభ్యర్థులు చదివిన ప్రాథమిక స్థాయిలోని గణిత సామర్థాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఇందులో రాణించాలంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలపై పట్టు ఉండాలి. భాగస్వామ్యం, లాభనష్టాలు, శాతాలలో చాలారకాల ప్రశ్నలు ఉంటాయి. వీటిని సాధన చేస్తే తర్వాతి విభాగాల్లో ప్రశ్నలు చేయడం సులువు.
కాలం-దూరం, రైళ్ళలో కూడా దాదాపు అన్ని ప్రశ్నలూ ఒకేలా ఉంటాయి. సంభావ్యత, క్యాలెండర్, గడియారాలు మొదలైన అంశాలనుంచి తప్పక ప్రశ్నలు వస్తాయి. బారువడ్డీ, చక్రవడ్డీ సూత్రాలపై ప్రశ్నలు అడగవచ్చు. సంఖ్యల్లో చిన్న, పెద్ద, వాటి మధ్య వ్యత్యాసం, లబ్ధంపై ఎక్కువ సాధన చేయాలి.
త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, వృత్తం మొదలైనవాటి ఫార్ములాలు తప్పక నేర్చుకోవాలి. వీటివల్ల ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఘనపరిమాణాల్లో ఘనం, గోళం, స్థూపం మొదలైనవి నేర్చుకుంటే మంచిది. పాత ప్రశ్నపత్రాలను చూసి వాటి కంటే కొంచెం ఎక్కువస్థాయి సాధన చేసుకోవటం ఉత్తమం.
5 కి.మీ. పరుగు ఎలా?
పరుగెత్తేటపుడు స్పోర్ట్ షూ, పలుచని కాటన్ సాక్స్ ధరించాలి. షూ లేకుండా పరుగెత్తేవారు కాలివేళ్ళకు కాటన్ ప్లాస్టర్ చుట్టుకోవాలి. వదులయిన కాటన్ దుస్తులు ధరించాలి. 5 కి.మీ. పరుగు పందెం కోసం ప్రతిరోజూ కనీసం 2.5-4 కి.మీ. దూరం పరుగెత్తాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి సమయంతో నిమిత్తం లేకుండా సాధన చేయాలి. ఇలా చేస్తే శ్వాసపై నియంత్రణ వస్తుంది.
వారానికి ఒకసారి 5 కి.మీ. దూరాన్ని లక్ష్యంగా చేసుకొని పరుగెత్తాలి. ఎన్ని నిమిషాల్లో పరుగు పూర్తిచేశారో రికార్డు చేసుకోవాలి. కేవలం ముక్కుతోనే కాకుండా నోటితో కూడా శ్వాస తీసుకోవచ్చు. పరిగెత్తేప్పుడు చేతుల కదలిక చక్కగా ఉండాలి. ఈ కదలిక ఎంత సులభంగా ఉంటే అంత దూరంగా అడుగులు వేయవచ్చు. పరుగెత్తేపుడు కండరాలు బిగించినట్లు కాకుండా వదులుగా ఉంచి పరుగెత్తడం మంచిది.
ఫిజికల్ ఎఫిషియంట్ టెస్టు (PET):
100 మీటర్ల పరుగు పందెం:
దీని సాధన సమయంలో 100 మీటర్లు మాత్రమే పరుగెత్తకుండా మొదట 30 మీటర్లు, తర్వాత 60 మీటర్లు, 90 మీటర్లు, 120 మీ|| సాధన చేయాలి. ఈవెంట్ ప్రారంభ సమయంలో పాదం ముందు భాగంపై నిలబడి విజిల్ సౌండ్‌పై ఏకాగ్రత ఉంచి ఆ శబ్దానికి అనుగుణంగా పరుగును ప్రారంభించి లక్ష్యాన్ని పూర్తిచేసే దిశవైపు మాత్రమే చూడాలి. మొదట ప్రారంభించిన వేగాన్ని పెంచుతూ చివరగా 100 మీటర్ల లైను దాటేంతవరకు అదే వేగాన్ని కొనసాగించాలి.
800 మీటర్ల పరుగు
ఇందుకోసం ఎక్కువ దూరం పరుగెత్తడం అభ్యాసం చేయాలి. కనీసం వారానికి ఒకసారి 3000 మీటర్లు నుంచి 4000 మీటర్లవరకు దూరం పరుగెత్తాలి. దీంతోపాటుగా 400 మీ. 800 మీ. 1000 మీ. రోజువారీగా పరుగెత్తడం వల్ల వేగం, Leg movementపెరుగుతుంది. మూలమలుపులు కూడా సాధన చేయాలి.
800 మీటర్ల పరుగులో పాల్గొనేవారు దీర్ఘవృత్తాకార పరిధిలో పరుగెత్తాల్సి ఉంటుంది. అందుకని ప్రారంభం నుంచి లోపలి వైపున్న అంచుల వెంబడి పరుగెత్తుతూ ముందు పరుగెత్తుతున్న అభ్యర్థి కుడి నుంచి Over takeచేస్తూ తిరిగి తను లోపలి అంచుల వెంబడే పరుగు సాగించాలి. పరుగు చివరిదశలో చేతులను వేగంగా కదిలించడం ద్వారా కాళ్లు అడుగులు దూరంగా పడటం ద్వారా తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవచ్చు.
హై జంప్
ఇందులో ఎక్కువ ఎత్తు దూకడానికి కాలి కండరాల బలం, శరీరభాగాల సమన్వయ శక్తి తోడ్పడుతుంది. ఈ పోటీలో 1.20 మీటర్ల ఎత్తు దూకాలి. అందుకోసం ముందుగా రన్ అప్ చేసి ఎత్తుకు ఎగరడాన్నీ, నేలకు సురక్షితంగా చేరడాన్నీ సాధన చేయాలి. రన్ అప్ ప్రధానంగా ఎత్తు ఎగరడానికి కావలసినంత వేగంతో- చక్కని టేక్ అప్ పొజిషన్ గాలిలో ఎగరడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో బ్యాక్‌జంప్, బెల్లీరోల్, సిజరింగ్, స్టేట్‌జంప్‌లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో ఎడమకాలితో టేకాఫ్ తీసుకొని జంప్ చేసేటప్పుడు బార్ మీద పడుకునే పొజిషన్ ఉండాలి. ఇసుకలో మొదట కుడికాలు ల్యాండ్ అవుతూ అదే సమయంలో మోచేతి మీదుగా ల్యాండ్ అవాలి. సిజరింగ్, State Jumpదూకేవారు కనీస వేగంతో టేకాఫ్ వేగంతో చేసి బార్‌కు తగలకుండా పైకి ఎగరాలి. ఈ ఈవెంట్ కోసం మొదట కింది నుంచి అంటే 50 సెం.మీ. నుంచి క్రమంగా పెంచుతూ దూకుడును పెంచుకోవచ్చు. ఈ విధంగా రోజూ సాధన చేస్తే వీలైనంత ఎత్తు ఎగరగలరు. దూకటం మెరుగవడం కోసం Skipping, Stepups exerciseలు ఉపయోగపడతాయి.
లాంగ్ జంప్
ఇందులో హ్యాంగ్‌స్త్టెల్ ఉపయోగిస్తే సులభంగా అర్హత పొందవచ్చు. ఈ శైలిలో గాలిలో శరీరాన్ని కాళ్ళు, చేతులను వెనక్కి వంచి ఊపుతూ ముందుకు దూసుకెళ్తూ నేలమీదకు ల్యాండ్ అయ్యేవరకు కాళ్ళు చేతులను ముందుకు తేవాలి. దీనికోసం కనీసం రన్‌వే 12 మీ|| - 14 మీ|| వరకు తీసుకోవాలి. లాంగ్‌జంప్‌లో వేగంగా రావడమేగాక టేకాఫ్ దగ్గర గట్టి కిక్ కొట్టాలి. శరీరం టేకాఫ్ లెగ్‌కంటే ముందుకు వంగి ఉంటే 20 సెం.మీ. నుండి 25 సెం.మీ. వరకు జంప్ పెరుగుతుంది. దీనికోసం 30-50 మీటర్ల స్ప్రింట్ సాధన చేయాలి.
షాట్‌పుట్
ఇందులో హ్యాంగ్‌స్త్టెల్ ఉపయోగిస్తే సులభంగా అర్హత పొందవచ్చు. ఈ శైలిలో గాలిలో శరీరాన్ని కాళ్ళు, చేతులను వెనక్కి వంచి ఊపుతూ ముందుకు దూసుకెళ్తూ నేలమీదకు ల్యాండ్ అయ్యేవరకు కాళ్ళు చేతులను ముందుకు తేవాలి. దీనికోసం కనీసం రన్‌వే 12 మీ|| - 14 మీ|| వరకు తీసుకోవాలి. లాంగ్‌జంప్‌లో వేగంగా రావడమేగాక టేకాఫ్ దగ్గర గట్టి కిక్ కొట్టాలి. శరీరం టేకాఫ్ లెగ్‌కంటే ముందుకు వంగి ఉంటే 20 సెం.మీ. నుండి 25 సెం.మీ. వరకు జంప్ పెరుగుతుంది. దీనికోసం 30-50 మీటర్ల స్ప్రింట్ సాధన చేయాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment