Saturday, January 19, 2013

ఉద్యోగాలకు 44 మంది ఎంపిక

నైకి చెందిన గ్లెన్‌వుడ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జనవరి 18న చిరంజీవిరెడ్డి విద్యాసంస్థల్లో నిర్వహించిన రాయలసీమ స్థాయి ప్రాంగణ ఇంటర్వ్యూలకు విద్యార్థులు పెద్దసంఖ్యలో వచ్చారు. దాదాపు 700 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిపిన వివిధ రకాల పరీక్షల్లో 44 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు. సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజరు ఆనందకుమార్‌ పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనే చాలామంది చతికిలబడ్డారు. అన్నమాచార్య కళాశాల నుంచి ముగ్గురు, చిరంజీవిరెడ్డి కళాశాల నుంచి 11 మంది, ఇంటెలెక్చువల్‌ కళాశాల నుంచి 9 మంది, జెఎన్‌టీయూ నుంచి అయిదుగురు, కడప కెఎస్‌ఆర్‌ఎం కళాశాల, గేట్స్‌ కళాశాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్కేడీ కళాశాల నుంచి 10 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌ కె.చిరంజీవిరెడ్డి, డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో చివరి సంవత్సరం ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించాలన్న సంకల్పంతో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. 700 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా 44 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేయనున్న వారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం కల్పించామన్నారు.

No comments:

Post a Comment