Saturday, December 29, 2012

LIC - APPRENTICE DEVELOPMENT OFFICERS - 2012 - 13 ప్రిపరేషన్ విధా

LIC - APPRENTICE DEVELOPMENT OFFICERS - 2012 - 13
ప్రిపరేషన్ విధానం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు కావాల్సిన అర్హతలు, పరీక్ష విధానం, దరఖాస్తు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
నిర్వహించాల్సిన బాధ్యతలు:
అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ప్రాథమికంగా ఎల్ఐసీ ఉత్పత్తుల సేల్స్ పర్యవేక్షణ బాధ్యతలను నెరవేర్చాలి. ఏజెంట్లను నియమించి వారు ఎల్ఐసీ ఉత్పత్తులను అధికంగా విక్రయించేలా చూడాలి. దీనికోసం వారికి తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏజెంట్లు చేర్చిన పాలసీ హోల్డర్లతో కూడా అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడంలో వీరు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఏజెంట్లతో కలిసి పర్యటించి వారికి నైతికంగా, మానసికంగా చేయూతనివ్వాలి.
అర్హతలు:
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్‌లో పీజీ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎల్ఐసీలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* రాత పరీక్ష- అంశాలు: ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీన్లో రెండు పేపర్లు ఉంటాయి.... అవి..
1) రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ
2) జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్
ప్రశ్నలు - మార్కులు: ఈ పోస్టులకు ఎల్ఐసీ గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్‌ను పరిశీలించినప్పుడు ప్రశ్నలు - మార్కుల కేటాయింపు విధానం ఇలా ఉంటుంది...
అంశం
ప్రశ్నలు
మార్కులు
1) రీజనింగ్ఎబిలిటీ
25 ప్రశ్నలు
25 మార్కులు
2) న్యూమరికల్ ఎబిలిటీ
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
3) జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
4) ఇంగ్లిష్ లాంగ్వేజ్
25 ప్రశ్నలు
25 ప్రశ్నలు
కాల వ్యవధి: రెండు గంటలు.
నోట్: తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి మార్కుల్లో కోత విధిస్తారు. ఎంత మేరకు తగ్గించాలనేది ఎల్ఐసీ నిర్ణయిస్తుంది.
* అభ్యర్థులు ప్రతి పేపర్లో అర్హత మార్కులు సాధించాలి. కనీసం రెండు పేపర్లలో ఎల్ఐసీ నిర్దేశించిన సగటు మార్కులు సాధించాలి. వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సిలబస్ - ప్రిపరేషన్
ఈ పరీక్షలో విజయం సాధించేందుకు వేగం, ప్రాక్టికల్ వర్క్ చాలా అవసరం. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో సబ్జెక్టు ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తుంచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. టాపిక్‌ల వారీగా ప్రాథమిక భావనలు, విశ్లేషణ, ప్రాధాన్యం, అడ్వాన్స్‌డ్ అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేయాలి.
* రీజనింగ్ఎబిలిటీ
అభ్యర్థి తార్కిక ఆలోచనాశక్తిని, సమస్యకు పరిష్కారం ఏవిధంగా కనుక్కొంటున్నారనే విషయాలను ఈ విభాగం ద్వారా పరిశీలిస్తారు. ఇందులో నంబర్ సిరీస్, కోడింగ్ - డీ కోడిండ్, బ్లడ్ రిలేషన్స్, లెటర్ సీక్వెన్సెస్, సీటింగ్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్ మొదలైన అంశాలు ఉంటాయి.
ప్రిపరేషన్: ఈ విభాగంలో ప్రశ్నలన్నీ అభ్యర్థిని మరీ ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండవు. రీజనింగ్‌లో మంచి మార్కులు రావాలంటే సింబల్స్, లెటర్ సిరీస్ బాగా తెలిసి ఉండాలి. బ్లడ్‌రిలేషన్స్, కోడింగ్- డీకోడింగ్‌పై వచ్చే ప్రశ్నలను సులభంగా గుర్తించగలగాలి. దీనికోసం గత పరీక్ష పేపర్లను, మోడల్ పేపర్లను పరిశీలిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగంలో నంబర్ సిస్టమ్స్ (కంప్యుటేషన్ ఆఫ్ హోల్ నంబర్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్), పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్ (సింపుల్, కాంపౌండ్), ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్టనర్‌షిప్ బిజినెస్ మొదలైన అంశాలు ఉంటాయి. మ్యాథ్స్‌పై అభ్యర్థికి ఉన్న సామర్థ్యాన్ని పరిశీలించడమే కాదు, లెక్కలు ఎంత వేగంగా చేయగలుగుతున్నాడో కూడా పరిశీలించడం ఈ విభాగం ముఖ్య ఉద్దేశం.
ప్రిపరేషన్ విధానం: చాప్టర్ల వారీగా రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ విభాగంపై పట్టు సాధించవచ్చు. ప్రధానమైన సూత్రాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ప్రశ్నలను వేగంగా సాధించగలిగే షార్ట్‌కట్ పద్ధతులు నేర్చుకుని సాధన చేయాలి. ఫార్ములాలను ఉపయోగించడం, ఆప్షన్ల ద్వారా జవాబులను గుర్తించడం వంటివి చేయాలి. తార్కిక ఆలోచనా విధానంలో కొన్ని కాలిక్యులేషన్స్‌ను వేగంగా చేయగలగే స్పీడ్ మ్యాథ్స్ పద్ధతులు తెలుసుకోవాలి.
* జనరల్ అవేర్‌నెస్
దీన్లో భారతదేశ చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, జనరల్ సైన్స్, భూగోళ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు తదితర అంశాలకు సంబంధించి బేసిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు అంతర్జాతీయ సంస్థల సదస్సులు, క్రీడలు, వాటి ప్రాథమ్యాలు; శాస్త్ర సాంకేతిక సంబంధ విశేషాలు, భౌగోళిక నామాలు, ముఖ్యమైన తేదీలు, పుస్తకాలు, రచయితలు తదితర అంశాలు కూడా ఉంటాయి.
కరెంట్ అఫైర్స్
పరీక్షకు 5 లేదా 6 నెలల ముందు నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో జరిగిన సంఘటనల సమాహారమే కరెంట్ అఫైర్స్. పరీక్ష ఎల్ఐసీకి సంబంధించింది కాబట్టి ఈ విభాగంలో... ప్రధానంగా ఆర్థిక రంగంలో చోటుచేసుకున్న మార్పులు, ఆర్థిక వృద్ధి రేటు, కేంద్ర బెడ్జెట్, బ్యాంక్ వడ్డీ రేట్లు, క్రెడిట్ పాలసీలు, ఎల్ఐసీ నూతన ప్రకటనలు మొదలైన అంశాలుంటాయి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, నోబెల్ బహుమతులు, కళలు, సినిమా తదితర కళాత్మక రంగాల్లో కృషి చేసిన వారికి ఇచ్చే పురస్కారాలు, గ్రంథాలు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలు - ట్రోఫీలు మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు ఉంటాయి.
ప్రిపరేషన్: జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ రెండూ సిలబస్ పరంగా చాలా క్లిష్టంగా అనిపిస్తాయి. కాకపోతే క్రమ పద్ధతిలో చదివితే ఈ విభాగంలో మంచి మార్కులు స్కోర్ చేయవచ్చు. మొదట జనరల్ నాలెడ్జ్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. చరిత్ర, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను చదివేటప్పుడు ప్రాథమిక అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు దినపత్రికలు (ప్రధానమైనవి తెలుగు, ఇంగ్లిష్) తీసుకుని పరీక్ష కోణంలో చదవాలి. ముఖ్యమైన అంశాలపై బిట్లు రాసుకోవాలి. దీనివల్ల పరీక్షలో ఈ విభాగాన్ని సులువుగా నెగ్గుకురావచ్చు.
* ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో ఇంగ్లిష్ ఫండమెంటల్స్, బేసిక్ గ్రామర్ పాయింట్లపై ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి. ఒకాబ్యులరీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, స్పాటింగ్ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్ తదితరాంశాలపై మంచి అవగాహన అవసరం.
ప్రిపరేషన్: ఈ పేపర్ ఎక్కువగా గ్రామర్ టాపిక్‌లపైనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు గ్రామర్ మీద ఎంత పట్టు ఉంటే ప్రశ్నల సాధన అంత తేలిక అవుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజీ బాగా వచ్చేందుకు, అవగాహనా శక్తి పెరిగేందుకు రోజూ కనీసం 5 కొత్త పదాలు నేర్చుకోవాలి. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి గ్రామర్ పరంగా తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఇంగ్లిష్‌లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
మోడల్ పేపర్లతో సమయం ఆదా: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే మోడల్ పేపర్లు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రిపరేషన్ స్థాయి తెలుస్తుంది. పరీక్షలో మంచి స్కోర్ సాధించాలంటే ఏంచేయాలో ఒక అవగాహనకు రావచ్చు. తర్వాత నిర్ణీత సమయాన్ని కేటాయించి మోడల్ పేపర్లు సాధన చేస్తుంటే పరీక్షలో మంచి ఫలితాలు వస్తాయి.
గుర్తుంచుకోండి
* ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కాబట్టి ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి.
* ప్రిపరేషన్ కోసం మార్కెట్లో కనిపించే ప్రతి మెటీరియల్ కొనకూడదు.
* పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని టైమ్ టేబుల్‌ను వేసుకోవాలి. ప్రిపరేషన్‌లో ఏ సబ్జెక్టులో తక్కువ స్కోర్ వస్తోందో దానిపై ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
* ప్రిపరేషన్ విధానం లాజికల్‌గా, టెక్నికల్‌గా ఉండాలి.
దరఖాస్తు:
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యేంత వరకు అభ్యర్థికి చెల్లుబాటైన ఇ-మెయిల్ ఐడీ ఉండాలి. ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత ప్రింట్ అవుట్ అప్లికేషన్ తీసుకోవాలి. దీన్ని ఎల్ఐసీ కార్యాలయానికి పంపకూడదు. ఇంటర్వ్యూ సమయంలో మాత్రమే ప్రింట్ అప్లికేషన్‌ను అందజేయాల్సి ఉంటుంది.
ఫీజు: ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇతరులు ఎల్ఐసీ సూచించిన మేర ఫీజును సమీప ఎస్‌బీఐ బ్రాంచీలో చెల్లించి రిసిప్ట్‌ను పొందాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజుల్లో ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన రెండు రోజుల తర్వాత అభ్యర్థులకు మెయిల్/ ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారిత సమాచారం అందుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ పొందవచ్చు.
* ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ:
ఈ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎల్ఐసీ ఉచిత శిక్షణ ఇస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను తమ సమీప ఎల్ఐసీ డివిజినల్ ఆఫీస్‌లో సీనియర్ డివిజినల్ మేనేజర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
తాజా నోటిఫికేషన్ వివరాలు:
ఎల్ఐసీ ఇటీవల దేశవ్యాప్తంగా 5201 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ పరిధిలో వివిధ డివిజినల్ కార్యాలయాలకు 613 పోస్టులను కేటాయించారు.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబరు 21 నుంచి ప్రారంభమైంది.
* చివరి తేదీ: డిసెంబరు 22.
* ఆన్‌లైన్ టెస్ట్: 2013 ఫిబ్రవరి 2, 3 తేదీలు.
వెబ్‌సైట్: http://www.licindia.in/careers.htm

No comments:

Post a Comment